నేను భారత జాతీయ వాదిని. మోదీ గెలుస్తారో, లేదో తెలియదు. మళ్లీ పార్లమెంట్‌కు వస్తారో రారో కూడా తెలియదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆయన పాతబస్తీ వట్టేపల్లిలో ఓటువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ అంటే మొత్తం భారత దేశం కాదు.. రాజకీయ నాయకుల కంటే దేశం గొప్పదని అన్నారు. వ్యక్తులకంటే దేశం గొప్పదని అందుకే ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్య భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విన్నవించారు.
కాగా, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాధవీలత సికింద్రాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.









