దేశంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థుల ప్రక్రియ పూర్తి చేస్తున్న కమలం పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ఇప్పుడు కమలం పార్టీ లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. రేపు ఏప్రిల్ 14వ తేదీన ‘సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు ‘న్యాయ పత్ర’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దానికి ధీటుగా బీజేపీ రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా ఈ సంకల్ప పత్రాన్ని విడుదల చేయనున్నారు.









