AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దానం నాగేందర్‌ సత్యహరిశ్చంద్రుడేం కాదు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్‌లో తన ఇంటికి సమీపంలోనే 700 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం కబ్జా చేయనివ్వలేదని..పార్టీ మారగానే స్థలాన్ని ఇంటి ఆవరణలో కలిపేసుకున్నారన్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల పార్టీ మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దానం నాగేందర్ స్వప్రయోజనాల కోసం పార్టీ మారారని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానంపై సంచలన ఆరోపణలు చేశారు.

తాజాగా వెళ్లి చూస్తే ప్రభుత్వ భూమి అనే బోర్డు మాయం చేసి కబ్జా చేసిన స్థలాన్ని తన ఇంట్లో కలుపుకున్నారని ఆరోపించారు. మెుత్తం 700 గజాల స్థలం కబ్జా చేశారని.. అందుకు సంబంధించిన ఫుటేజ్‌ను కావాలంటే ఇస్తానని చెప్పారు.

ANN TOP 10