AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంచు వారింట సంద‌డి.. తండ్రైన మనోజ్‌

మంచు వారి ఇంట మ‌రోసారి సంద‌డి మొద‌లైంది. మంచు మ‌నోజ్ (Manoj) ఈ రోజు తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందారు. ఆయ‌న భార్య భూమా మౌనికా రెడ్డి పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని మంచు లక్ష్మి , మ‌నోజ్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

ఆ దేవ‌తల అశీస్సుల‌తో మా ఇంటికి చిన్ని దేవ‌త వ‌చ్చింద‌ని, ఈ సంద‌ర్భంగా పాప‌కు ముద్దు పేరుగా మ‌నోజ్ (Manoj) మౌనిక ( Mounika) పేర్ల‌లోని ఫ‌స్ట్ లెట‌ర్స్ వ‌చ్చేలా ‘MM Puli’ అని పెట్టామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని మంచు లక్ష్మి త‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్ ద్వారా ప్ర‌క‌టిస్తూ రెండు యానిమేటెడ్ ఫొటోల‌ను జ‌త చేసి పోస్టు చేయ‌గా మ‌నోజ్ దానిని రీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

ANN TOP 10