మెదక్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్యే పోటీ అన్నారు. రాముడు దేవుడు.. కానీ ఆయన్ని ఓ పార్టీకి లీడర్‌ని చేశారన్నారు. మెదక్‌లో ఆ పార్టీ పేరే ఎత్తకండన్నారు. ఆయన్ని గిచ్చకండి.. ఎప్పుడు గిచ్చుతరా అని చూస్తాడని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మెదక్ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన గడ్డపై మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. మన అభ్యర్థి నీలం మధు బీసీ అయినా అన్ని కులాల మద్దతు అవసరమన్నారు. అన్ని కులాలు, మతాలతో కూడుకున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. సంగారెడ్డిలో తన భార్య పార్టీ కోసం కష్టపడుతుందని, తాను బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కే మెదక్‌లో పోటీ ఉందని అంటూ వ్యాఖ్యలు చేశారు. మొదట ఇది బాగా రెడ్డి నియోజకవర్గం.. తర్వాత ఇందిరమ్మ ఇక్కడి నుండి గెలిచారన్నారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో కాంగ్రెస్ పై చేయి సాధించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.









