(అమ్మన్యూస్, హైదరాబాద్):
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మరం చేశారు. అందులో భాగంగా శనివారం చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. భారీ బహిరంగ సభకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కాసాని టీమ్ విజ్ఞప్తి చేసింది.









