AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ యుద్ధంలో మీ బిడ్డ ప్రజల పక్షం: సీఎం జగన్

ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్‌కి కాదని, ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. విశ్వసనీయత ఒకవైపు, మోసాలు మరోవైపు.. ఇంటింటి అభివృద్ధి ఓవైపు.. అసూయ మరోవైపు.. ధర్మం ఓ వైపు.. అధర్మం మరోవైపు ఉందని అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ యుద్ధం జరుగుతుందన్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డ ప్రజల పక్షం అని గర్వపడుతున్నానని చెప్పారు. కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద ఇన్ని జెండాలు, ఇన్ని కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని విమర్శించారు. మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా..? అని అడిగారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అనేది ఆలోచించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఏపీలో రెండు ప్రత్యామ్నాయాలున్నాయని, గతంలో మూడు సార్లు అధికారంలో ఉండి.. అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు బృందం కనిపిస్తోందన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జగన్ పేరు చెబితే మాత్రం గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు గుర్తుకు వస్తాయని చెప్పారు. బటన్ నొక్కి నేరుగా ఖాతాలో డబ్బులు పడేలా చేశామన్నారు. ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చామని తెలిపారు. ఇంటింటికి సంక్షేమాన్ని అందించామని పేర్కొన్నారు. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్తు ఆదారపడి ఉందన్నారు. ఎవరి వల్ల మీకు మంచి జరుగుతుందో ఆలోచించాలని సూచించారు. ఎవరికి ఓటు వేస్తే భవిష్యత్తు మారుతుందో తెలుసుకోవాలని సీఎం జగన్ అన్నారు.

ANN TOP 10