AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నెహ్రూ, ఇందిరలను దాటేసిన మోదీ… ఎర్రకోట ప్రసంగాల్లో రికార్డ్ .

భారత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశానికి సుదీర్ఘకాలం సేవలందించిన నలుగురు ప్రధానమంత్రుల్లో, ఎర్రకోట నుంచి అత్యధిక సమయం ప్రసంగించిన నేతగా ఆయన నిలిచారు. ప్రసంగాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం ప్రసంగ సమయం పరంగా మాజీ ప్రధానులందరి కంటే ఆయన ముందంజలో ఉండటం విశేషం.

ప్రధాని మోదీ ఇప్పటివరకు 13 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల్లో ద్వారా మొత్తం 1,177 నిమిషాలు పాటు ప్రసంగించారు. ఇదే క్రమంలో, 16 ప్రసంగాల్లో ఇందిరా గాంధీ 504 నిమిషాలు, 10 ప్రసంగాల్లో మన్మోహన్ సింగ్ 417 నిమిషాలు, 17 ప్రసంగాల్లో జవహర్‌లాల్ నెహ్రూ 400 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.

దేశ తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీల కంటే మోదీ తక్కువ సార్లు ప్రసంగించినప్పటికీ, వారిద్దరి మొత్తం ప్రసంగ సమయం కంటే రెట్టింపునకు పైగా మాట్లాడారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ కార్యక్రమాలు, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యం సాధన వంటి అంశాలపై ప్రభుత్వ విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరంగా తెలియజేయడానికే ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రసంగాలకు ప్రాధాన్యతనిచ్చారు.

ANN TOP 10