మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము. తాట తీస్తాం. నేను భయపడను అంటూ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పలువురు సీరియస్‌గా తీసుకోగా.. మరి కొందరు ఫన్నీగా తీసుకుని విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందులోనే ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఇప్పుడే కేటీఆర్ ప్రెస్‌మీట్ చూశాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో అతనని అరెస్ట్ చేయవచ్చని సంకేతాలు వచ్చాయి అనుకుంటా. ఆయన మోహంలో ఒకరకమైన ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కేటీఆర్ కర్మఫలం అంటూ’ ట్వీట్ చేశాడు.









