AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తమ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పెలితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలను ఓడించడం ఖాయమన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తున్నారని అన్నారు. తన ఫోన్‌తో పాటు తన సిబ్బంది, చివరకు డ్రైవర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ల వల్ల బీఆర్ఎస్ నేతలే రాజకీయ లబ్ధి పొందారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ సభా ప్రాంగణం నుంచి ‘తెలంగాణ జనజాతర’ సభా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని అన్నారు.

ANN TOP 10