AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మయాంక్ మాయాజాలం.. హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ మళ్లీ బోల్తా.. 28 రన్స్ తేడాతో లక్నో గెలుపు

సొంత గడ్డపై ఆర్సీబీ మళ్లీ బోల్తా పడింది. మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు క్వింటన్ డి కాక్ (81) అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు చతికిల పడింది. 153 పరుగులకు ఆలౌటై హోం గ్రౌండ్‌లో 28 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. మహిపాల్ లోమ్రోర్ అత్యధికంగా 33 పరుగులు చేయగా, రజత్ పాటిదార్ 29 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత, మరే ఇతర RCB ఆటగాడు ఇన్నింగ్స్ నుండి కోలుకోలేదు. గతంలో ఇదే మైదానంలో కేకేఆర్‌ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో RCBకి ఇది మూడవ ఓటమి మరియు లక్నోకు వరుసగా రెండవ విజయం. లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించిన మయాంక్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా అతను వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికవ్వడం విశేషం.

చిన్నస్వామి స్టేడియంలో 200లోపు స్కోరును ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాని సొంత గడ్డపై ఆర్సీబీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. డించింది. విరాట్ కోహ్లి 22 పరుగులు చేసి ఔట్ అయ్యి నిరాశపర్చాడు. విరాట్ అవుటైన తర్వాత రజత్ పాటిదార్ 29 పరుగులు, మహిపాల్ లోమ్రోర్ 33 పరుగులు చేశారు. వీరిద్దరూ తప్ప మరే ఇతర ఆటగాడు మైదానంలో పరుగులు సాధించలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో అందరి దృష్టి రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన లక్నో ఆటగాడు మయాంక్ యాదవ్‌పై పడింది. అందుకు తగ్గట్టే 4 ఓవర్ల తన స్పెల్‌లో 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

ANN TOP 10