AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు: మం‍త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సంసారాల్లోనూ ట్యాపింగ్‌తో చిచ్చుపెట్టారని మండిపడ్డారు. బుధవారం ఆయన తన నివాసంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దానం నాగేందర్‌ను ఎంపీగా గెలిపించాలని కోరారు. అప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్ అభివృద్ధి జరుగుతుందన్నారు. రెండు లక్షల మెజార్టీని తీసుకురావాలన్నారు. ఇందుకోసం నాయకులంతా కలసి పనిచేయాలని కోరారు.

సమన్వయంతో వర్క్ చేస్తూ ఎన్నికల్లో గెలవాలన్నారు. తాను సమన్వయకర్తను మాత్రమే అని, స్థానిక నాయకులంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. గతంలో కూడ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎంపీగా గెలిచారని, ఆయనకూ బలమైన కేడర్ ఉన్నదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కేడర్ అంతా సమన్వయంతో నాగేందర్‌ను గెలిపించాలన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనసులో పెట్టుకోకుండా కార్యకర్తలంతా కలిసిమెలిసి పనిచేయాలన్నారు.

రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులందరం కలిసి కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే అంతం అయిపోతుందన్నారు. పదేండ్లు పరిపాలన చేసినా, కింది స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి మంత్రులుగా పనిచేసిన వాళ్లు పార్టీని వీడుతున్నారన్నారు. కుటుంబ పాలనతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశంలో ఏ పార్టీ కూడ ఇంతలా దిగజారి పోలేదన్నారు. కార్యకర్తలతో కలిసి పనిచేసే పార్టీలు మాత్రమే నిలదొక్కుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ కార్యకర్తల పార్టీనే అని, పదేండ్లు అధికారంలో లేకున్నా, కార్యకర్తల కృషివల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చినమన్నారు.

ANN TOP 10