AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లెక్కలు తీస్తాం.. బజారులోకి ఈడుస్తాం: కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే పంటలు ఎండాయాని, ఎకరానికి రూ. 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట, జనగామ, నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పాలనలో లేని ట్యాంకర్లు, బిందెలు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రూపాయికే నల్లా కనెక్షన్, ఫ్రీ వాటర్ ఇచ్చామన్నారు. 35 వేల కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ రంగాన్ని బాగు చేశామని గుర్తు చేశారు. 24 గంటలు కరెంట్ ఇచ్చామని, స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అధికార పార్టీ అవివేకం, తెలివితక్కువతనం, అవగాహన రాహిత్యం క్లియర్ గా కనిపిస్తోందన్నారు. ఉన్న కరెంట్ ను మిషన్ భగీరథను వాడే తెలివి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయిందని ప్రశ్నించారు. రాజకీయాలు చేసే తీరిక ఉంది.. కానీ కరెంట్, వాటర్ ఇచ్చే తీరిక లేదన్నారు. జూన్ వరకు వర్షాలు రావు.. అప్పటి వరకు వర్షాలు రాకుంటే రైతుల పరిస్థితి ఏం కావాలి అని ప్రశ్నించారు.

మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్

తమ పార్టీ నేతలను కాంగ్రెస్, బీజేపీలో చేర్చుకోవడం పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్కల్ని, నక్కల్ని గుంజుకొని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీఫ్ పాలిటిక్స్ అన్నారు. రాజకీయాలు చేస్తూ.. పోతే ప్రజలు ఏం కావాలి..? రాజకీయాలు చేయడానికి మేము రెడీ.. చాలా మందిని పాతరేశాం అన్నారు. రైతుల పక్షాన మాట్లాడే వారు ఎవ్వరూ లేరనుకుంటున్నారా..? బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఒకరిద్దరు చిల్లర గాళ్లు పోతే పార్టీకి నష్టం లేదన్నారు. సీఎం కి ఢిల్లీకి పోవడమే సరిపోతుంది. మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజుల్లో రైతులు ఏడ్చే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఖరికి కారణమని కేసీఆర్ దుయ్యబట్టారు.

ANN TOP 10