AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. ఏలేటి వ్యాఖ్యలపై కేఎస్‌ఆర్ ఫైర్

మహేశ్వర్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కూలుస్తామని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారని, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని టచ్ చేసి చూడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు చెట్టుకు కట్టేసి కొడతారని విమర్శించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాట్లాడితే.. ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఎంత ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారని, ఖబడ్దార్.. మహేశ్వర్ రెడ్డి అంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. మరోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు తరిమికొడతారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కారు పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.

ANN TOP 10