AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కరీంనగర్‌లో వినోద్‌.. పెద్దపల్లిలో కొప్పుల

ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌
10న భారీ బహిరంగ సభ
ఆరోజే ఎన్నికల శంఖారావం పూరించనున్న బీఆర్‌ఎస్‌ అధినేత

అమ్మన్యూస్‌, ప్రతినిధి, హైదరాబాద్‌:
ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ఖరారు చేసింది. కరీంనగర్‌ నుంచి బోయినపల్లి వినోద్‌, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా కేసీఆర్‌ ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఈ నెల 10న కరీంనగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభపై కూడా చర్చించారు. ఇక్కడి నుంచే కేసీఆర్‌ ఎంపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయ. మరోవైపు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షించనున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో బీఆర్‌ఎస్‌ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, సంతోష్‌కుమార్‌, వినోద్‌కుమార్‌తో పాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నేతలు హాజరయ్యారు.

ANN TOP 10