AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే?

వరంగల్‌ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్‌ తలిగింది. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్ర నేతలు ఆయనను కలిసినట్లు సమాచారం. అయితే రమేష్‌ పార్టీ మారుతుండటంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేసీఆర్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్‌ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఆరూరి రమేష్‌తో బీఆర్‌ఎస్‌ అగ్ర నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రమేష్‌ను బుజ్జగించే బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. కానీ ఆయనని బుజ్జగించేందుకు కడియం అంగీకరించలేదు. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం రంగంలోకి దించింది. ఆరూరి రమేష్‌ను పార్టీ మారకుండా బస్వరాజు బుజ్జగిస్తున్నారు. అయితే రమేష్‌ పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ANN TOP 10