AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ కానున్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంతో పాటు ఈ నెల 10న కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో నిర్వహించనున్న సమావేశంపై చర్చించున్నట్లు తెలుస్తున్నది. దాంతో పాటు రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, సంతోష్‌కుమార్‌, వినోద్‌కుమార్‌తో పాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నేతలు హాజరయ్యారు.

ANN TOP 10