బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ని రకుల్ ఈ నెల 21న గోవాలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. భగ్నానీ ఇంట్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్ ప్రీత్ సింగ్ 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఫిబ్రవరి 21న ఒక్కటి కాబోతున్నారు. గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకోబోతోంది.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలంలో నటించింది.









