AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జైనథ్‌ ఆలయంలో కంది, రమేష్‌ ప్రత్యేక పూజలు

అమ్మన్యూస్‌ ప్రతినిధి ఆదిలాబాద్‌: ఇంద్రవెల్లి సీఎం మీటింగ్‌ ఇన్‌చార్జి పటేల్‌ రమేష్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి గురువారం జైనథ్‌ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని జైనథ్‌, బేల, మండల కేంద్రాలతోపాటు రూరల్‌ మండలం లోని రామాయి గ్రామంలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాలలో పాల్గొని కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేసారు. ముందుగా జైనథ్‌ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో ఇరువురినీ సత్కరించారు. సీఎం రేవంత్‌ రెడ్డి సభ సక్సెస్‌ కావాలని ప్రార్థించడంతో పాటు రానున్న పార్లమెంట్‌ ఎన్నికలలో నల్గోండ లో పటేల్‌ రమేష్‌ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలని స్వామిని వేడుకున్నారు.


రమేషన్న నల్గొండ ఎంపీగా గెలిచి రావాలి
జైనథ్‌ లక్ష్మీ నారాయణ స్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమని ఆదిలాబాద్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటేల్‌ రమేష్‌ రెడ్డి లోక్‌ సభ ఎన్నికలలో నల్లగొండ ఎంపీ గా గెలిచి జైనథ్‌ కు తిరిగివచ్చి స్వామి దర్శనం చేసుకోవాలని కంది కోరారు. ముఖ్యమంత్రి రేవంతన్న కు అత్యంత సన్నహితుడని ఆయన ఎంపీగా గెలిచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ANN TOP 10