అమ్మన్యూస్ ప్రతినిధి : ఛలో ఇంద్రవెల్లి ..ఫిబ్రవరి 2న జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.. పెద్ద ఎత్తున విజయ వంతం చేయాలని మీటింగ్ ఇంఛార్జి పటేల్ రమేష్ రెడ్డి , అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ ,బేల, మండల కేంద్రాలతోపాటు రూరల్ మండలం లోని రామాయి గ్రామంలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాలలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసారు. ముందుగా జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో ఇరువురినీ సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ కావాలని ప్రార్ధించడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో నల్గోండ లో పటేల్ రమేష్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలని స్వామిని వేడుకున్నారు.
సీయం సభను విజయవంతం చేయాలి
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆశీర్వాదంతో మనం అధికారంలోకి వచ్చామని ఆరు గ్యారెంటీ హామీలు ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని మీటింగ్ ఇంఛార్జి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. వెంటనే రెండు హామీలు అమలు చేసి చూపిందన్నారు. అతి త్వరలోనే మర రెండు అమలు కానున్నాయన్నారు. 420 హామీలు అని బీఆర్ ఎస్ నాయకులు విమర్శించేముందు వారి హామీలు ఏమైనావో గమనించాలన్నారు. నిజమైన 420 హామీలు వారివన్నారు. రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ ఒక బెంచ్ మార్క్ లా గుర్తుండి పోయేలా మనం సక్సెస్ చేయాలన్నారు. ఈ నియోజక వర్గం నుండి ఇరవై వేల మందికి తక్కువ కాకుండా తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. సభ సమయానికంటే ముందే చేరుకొని సభ ముగిసే వరకు అక్కడే ఉండాలని నాయకులను కార్యకర్తలను కోరారు.
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని రమేష్ రెడ్డి అన్నారు. అందుకు ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపు నిచ్చారు.అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ నియోజక వర్గం నుండి పాతిక వేల మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అయోధ్య ఇష్యూను బీజేపీ తెరమీదకు తెచ్చిందన్నారు. దేశంకోసం దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రను దురుద్దేశ పూర్వకంగా అడ్డుకునే కుట్రలు అక్కడి బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికలలో తగినవిధంగా బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలిచే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
కంది శ్రీనివాస రెడ్డి పై ప్రశంసలు
ఎన్నికల్లో ఓడినా ప్రజల కోసం ఆలోచించే కంది శ్రీనివాస రెడ్డి లాంటి నాయకుడు దొరకడం మీ అదృష్టమన్నారు. ఆయనను మీ కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలన్నారు. మంచి భవిష్యత్తున్నయువనేత ప్రజల కోసం కష్ట పడే నాయకుడని ప్రశంసించారు. 30 ఏళ్లవరకు ఆయన రాజకీయాల్లో కొసాగుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఇక్కడి ఎమ్మెల్యేకు లేని బలం శ్రీనివాస రెడ్డికుందని మీ అందరు కలిసికట్టుగా ఇలాగే ముందుకు వెళ్తే నెక్స్ట్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డే అన్నారు. ఆయన క్యాంప్ ఆఫీస్ చూసానని చాలా బాగుందని కితాబిచ్చారు.

నేను మీమధ్యే ఉంటా ..
అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జైనథ్ మండలం కోసం ప్రత్యేకంగా ఈ జియస్ కింద 35 లక్షలు తీసుకొస్తున్నామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 8వేల ఆధిక్యం జైనథ్ నుండే రావాలని కంది శ్రీనివాస రెడ్డి కార్యకర్తలకు సూచించారు. దురదృష్టవశాత్తు గత ఎన్నికలలో ఓడనప్పటికీ అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్దులకంటే ఎక్కువ ఓట్లు సాధించ గలిగామని అన్నారు. నేను ఓడినా, గెలిచినా మీ మధ్యనే ఉంటానని నిరంతరం నియోజక వర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని కంది శ్రీనివాస రెడ్డి స్పష్టం చేసారు. మనం అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని ఆదిలాబాద్ నియోజకవర్గంనుండి 50 వేల ఓట్ల మెజారిటీ తీసుకురావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేసారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి రేవంతన్న వస్తున్నడు మనం భారీగా తరలి వెళ్లాలని శ్రేణుల్లో ఉత్సాహం నింపాడు పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్నిపూరించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. రేవంతన్న అందిస్తున్న సుపరి పాలనను ప్రజందరూ ఆశీర్వదించాలని కోరారు.
పార్టీలోకి చేరికలు
అనంతరం జైనథ్ మండలం మాండగడ సర్పంచ్ సైపట్ ఇందూ మహేందర్ రావు.. పటేల్ రమేష్ రెడ్డి , కంది శ్రీనివాస రెడ్డి ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బేలా మండలం పోనాల గ్రామ యువకులు ఉత్తమ్ రావు పొనాల, విజయ్, ప్రవీణ్, గంభీర్, అజయ్,లక్ష్మి కాంత్, వికాస్ వారి సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,గడ్డం జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,యాల్ల పోతా రెడ్డి,మైనారిటీ నాయకులు ఎం.ఏ షకీల్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,జైనథ్ గ్రామ ఎంపీటీసీ కొడిచేర్ల సుదర్శన్,ఖప్రి సర్పంచ్ రమీల-వెంకట్ రెడ్డి,బెల్లూరి రామ్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునిగేల విట్టల్, బద్దం సురేష్ రెడ్డి,మాజీ సాత్నాల ప్రాజెక్ట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,సోషల్ మీడియా జిల్లా కో. ఆర్డినేటర్ పుండ్రు రవి కిరణ్ రెడ్డి,అడ్డి రూకేష్ రెడ్డి,సంతోష్ రెడ్డి,కిష్టా రెడ్డి,ఎల్మ గంగా రెడ్డి,చిలుకూరి కషప్ రెడ్డి,సయ్యద్ సాబీర్,యెల్టీ ప్రదీప్ రెడ్డి,బండి కిష్టాన్న,అన్నెల సంజీవ్,ఎల్మ రామ్ రెడ్డి,రఫీక్,షేక్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.









