హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో లో వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. పాడికౌశిక్ రెడ్డి, కడియం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవం అయ్యారు.









