తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావహుల నుంచి 187 దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంట్ వారీగా డీసీసీల నుంచి వచ్చిన దరఖాస్తులు కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి చేరాయి. ఇవాళ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కీలక సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎవరెవరు నిలబడాలి? అనే దానికి సంబంధించి కీలకమైన మీటింగ్ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావహుల జాబితాను స్వీకరించారు.
* ఆదిలాబాద్ నుంచి 20 దరఖాస్తులు
* పెద్దపల్లి – 11
* కరీంనగర్ – 02
* నిజామాబాద్ – 06
* మెదక్ – 02
* మల్కాజ్ గిరి – 08
* సికింద్రాబాద్ – 04
* హైదరాబాద్ – 10
* చేవెళ్ల – 06
* మహబూబ్ నగర్ – 04
* నాగర్ కర్నూల్ – 17
* నల్గొండ – 09
* భువనగిరి – 28
* వరంగల్ – 37
* మహబూబాబాద్ – 19
* ఖమ్మం నుంచి 03 దరఖాస్తులు వచ్చాయి.









