AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే ఆసక్తికర ఎగ్జిట్ పోల్

కొన్ని రోజులుగా తెలంగాణలోని ఊరూ వాడా ప్రచారంతో అన్ని పార్టీలు హోరెత్తించాయి. నిన్నటితో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. సాధారణంగా నిన్న సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియాల్సి ఉండగా.. చాలా నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లు సాయంత్రం 5 తర్వాత కూడా క్యూలో ఉన్నారు. వారంతా ఓటు వేసే వరకూ అధికారులు ఎన్నికల ప్రక్రియ కొనసాగించారు. దాంతో.. కొన్ని కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరగడం మంచి విషయం. ఎన్నికలు పూర్తి కావడంతో నిన్న సాయంత్రమే పలు సర్వే సంస్థలు తెలంగాణ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాన్ని వెల్లడించాయి. మెజారిటీ సర్వే సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు జోస్యం చెప్పాయి.

తాజాగా ఇండియా టుడే ఆజ్ తక్ కూడా ఒక రోజు ఆలస్యంగా తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాన్ని వెల్లడించాయి. ఇండియా టుడే సర్వేలో కూడా అధికార బీఆర్ఎస్ (BRS) కు షాక్ తప్పవనే వెల్లడించాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్‌కు 34-44 సీట్లు వస్తాయని తమ సర్వేలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 63- 73 సీట్లు.. బీజేపీ 4 -8 సీట్లు.. ఇతరులు (ఎంఐఎం) 5-8 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ.. 20 యేళ్లలో 18 యేళ్లు అధికారంలో ఉన్న 140-162 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 68-90 సీట్టు వస్తాయని తెలిపింది. ఇతరులు 0-3 సీట్లు గెలుస్తుందని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది.

ఇక రాజస్థాన్‌లో జరిగిన 199 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని అన్ని సర్వేలకు భిన్నంగా పేర్కొంది. అటు కాంగ్రెస్ పార్టీ 86-106 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 9-18 సీట్లు గెలుస్తారని ఈ సర్వే తెలిపింది.

చత్తీస్‌ఘడ్‌లో బీజేపీ (BJP) 36-46 సీట్లు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ 40- 50 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇతరులు 1 నుంచి 5 సీట్లు గెలుస్తాయని పేర్కొంది.
అటు మిజోరాంలో MNF మిజోరాం నేషనల్ ఫ్రంట్.. 3-7 సీట్లు.. ZPM 28-35 సీట్లు.. కాంగ్రెస్ పార్టీ 2-4 సీట్లు.. బీజేపీ 0-4 సీట్లు వస్తాయని పేర్కొంది.

ANN TOP 10