ఖమ్మం: తెలంగాణ లో కాంగ్రెస్ సునామీ రాబోతుందని ఆ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం 20వ డివిజన్‌లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 80 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించ బోతుందన్నారు. ఖమ్మంలో నలభై నుంచి యాభై వేల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరనుందని స్పష్టం చేశారు. నోట్ల కట్టలతో గెలవాలనుకునే వారు ప్రజా బలం ముందు ఓడి పోవాల్సిందే అని తెలిపారు. అవినీతి సొమ్ముతో అధికార మదంతో ఖమ్మం లో తిరుగుతున్నారని మండిపడ్డారు. అరాచక అవినీతి పాలన తరమి కొట్టాలన్నారు. భూ కబ్జాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు.









