తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంటోంది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ది చేశామని చెప్పుకుంటున్న ఆపార్టీ నేతలకు బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను నమ్ముతారంటూ విమర్శించారు. తన అంధ విశ్వాసంతోనే పాత సచివాలయాన్ని కూల్చివేశారని చెప్పారు.తన మూఢ విశ్వాసంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్ లాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు మోదీ. మహబూబాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ అసమర్ధ, అవినీతి పాలనపై విమర్శలు చేసిన ప్రధాని మోదీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు.అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపిస్తామని చెప్పారు మోదీ.
అంధవిశ్వాసంతోనే ..
గతంలో కూడా ఇదే తరహాలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ని సీఎం చేయాలనుకుంటున్నారని చెప్పారు మోదీ. అందుకు తన ఆశీర్వాదం కావాలని కోరితే ఎవరు సీఎం అవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పానని ప్రజాసభలో చెప్పారు. ఇప్పుడు ఆయన మూఢ విశ్వాసాలపై కామెంట్ చేయడం రాజకీయంగా హాట్ టాపిగ్ గా మారింది.









