AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కామారెడ్డిలోనూ ‘కారు’దిగిన కీలక నేత

– రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరిన దోమకొండ జెడ్పీటీసీ
– మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలు సైతం అదే దారిలో..

ఎన్నికల ముందు కామారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. జిల్లాలోని దోమకొండ మండల జెడ్పీటీసీ తిరుమలగౌడ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. కరీంనగర్‌ సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు.

అయితే కొంతకాలంగా తిరుమలగౌడ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పిచకపోవడంతోనే పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమలగౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడంతో దోమకొండ మండలంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10