AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వక్భ్ భూములను కబ్జా చేసిన మంత్రి గంగుల: బీఆర్‌ఎస్‌ నేత సంచలన ఆరోపణలు

మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై ఆ పార్టీ నేత, కరీంనగర్ వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మొహసిన్ అహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాక, ముస్లింలకు అన్యాయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఖాజీపూర్ గ్రామంలోని 54 ఎకరాల వక్ఫ్ బోర్డ్ భూములు కబ్జా, రేకుర్తి గ్రామంలో పేద ముస్లింల 35 ఇండ్లను బుల్డోజర్ల ద్వారా ధ్వంసం చేయడం.. అన్యాయంగా వీరిపై అక్రమ పోలీస్ కేసులు బనాయించడం.. 15 సంవత్సరాలుగా కరీంనగర్‌లో ముస్లింలకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అని మొహసిన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ANN TOP 10