తెలంగాణను ప్రగతిబాట పట్టిద్దాం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణలో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ కేసీఆర్ తన కుటుంబాన్ని పైకి తేవడం తప్ప తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదన్నారు. తెలంగాణలో ప్రగతి వెనుకబడి పోయిందని జేపీ నడ్డా అన్నారు.
కాళేశ్వరం కేసీఆర్‌కి ఏటీఎంగా మారింది
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కి ఏటీఎంగా మారిందని, ధరణి పోర్టల్ తో కేసీఆర్ ఆక్రమణలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దళితబందు లాంటి పథకాలు బీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటించారు.. దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అని జేపీ నడ్డా పేర్కొన్నారు.









