AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ లీక్?.. సిరిసిల్లలో పరిస్థితులు మారుతున్నాయా?

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులే సమయముంది. టైమ్ తక్కువగా ఉండడంతో అన్ని పార్టీల నేతలు ఊరూరు గల్లీగల్లీ తిరుగుతున్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులను ఓడించడమే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో మంత్రి కేటీఆర్‌ (KTR) ఫోన్ కాల్ లీక్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. సిరిసిల్లలో మనోళ్లే పిచ్చిమాటలే మాట్లాడుతున్నారని.. మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు మంత్రి కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు. ప్రతి బూత్‌లోనూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.

ఫోన్ కాల్‌లో ఏముంది.?
‘‘మనకు ఇంకా వారం రోజులే సమయముంది. అందరూ ప్రతిగ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి. గాలి మాటలను నమ్మకండి. నేను ఎవరితోని మాట్లాడినా.. పక్క ఊళ్లో పరిస్థితి తేడాగా ఉందన్నా..జర చూస్కో అని చెబుతున్నారు. మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చిమాటలు బంద్ చేయండి. మహేందర్ రెడ్డి అక్కడ తిరుగుతున్నారు? ఆ కులపోళ్లు మనకు ఓటు వేయరంట అని వినిపిస్తున్నాయి. ఇవి మనోళ్లే మాట్లాడి..మనోళ్ల ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటివి ఆపండి. ఎక్కడిక్కడ పటిష్టం చేయాలి. సిరిసిల్లలో నేను ఓడిపోతానని వార్తలు రాస్తున్నారు. ఆ స్థాయికి రాసే కాడికిపోయిందంటే..మనం మాట్లాడే మాటల వల్లే..! గతంలో మాదిరి కాకుండా.. వచ్చే టర్మ్‌లో ప్రతి వారం రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటా. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పండి. మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పండి. ఎక్కడైనా ప్రజలు లొల్లి పెడితే కస్సుబుస్సు అనొద్దు. అందరూ నిమగ్నమై పనిచేయాలి. ’’ అని మంత్రి కేటీఆర్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది.

ANN TOP 10