AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సామాన్యుడిలా దాబాలో చాయ్‌..

సీఎం కేసీఆర్ సిద్దిపేటలోని ఓ దాబాలో టీ తాగి కాసేపు సరదాగా గడిపారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో పట్టణ శివారులోని పొన్నాల సోని దాబాలో టీ తాగారు. సీఎం కేసీఆర్‌తో పాటు.. మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ మధుసుదనా చారి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు. సామాన్యుడిలా సీఎం కేసీఆర్ దాబాలో టీ తాగటం చూసి.. అందరూ ఆశ్చర్యపోయారు.

ANN TOP 10