AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ సభకు బస్సులు.. బస్టాండ్లలో జనం తిప్పలు

రాజన్న సిరిసిల్ల: ‘‘పండుగ సమయంలో ఇదేం చోద్యం.. కేసీఆర్‌ సభలకు బస్సులట’’ అని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై జనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ, కరీంనగర్‌ బస్టాండ్లలో సొంతూర్లకు వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పండగ పూట నరకయాతన పడుతున్నారు. చిన్నపిల్లలతో బస్టాండ్‌లో గంటల తరబడి బస్సులు కోసం వేచిచూస్తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ, కరీంనగర్‌ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. సిరిసిల్లలో సీఎం కేసీఆర్‌ సభ కోసం అధికారులు బస్సులు కేటాయించారు. దీంతో జనానికి సరిపడా బస్సులు లేవు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పండుగ పూట బస్సులను జన సమీకరణకు తరలించడం ఏంటని ప్రయాణికుల బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ANN TOP 10