బ్రిటన్‌లో భారత్ హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని శుక్రవారం స్కాట్లండ్‌లోని గురుద్వారాలో ప్రవేశించనీయకుండా రాడికల్ సిక్కు గ్రూపులు అడ్డుకున్నాయి. గ్లాస్గో గురుద్వారాకి చెందిన కమిటీతో దొరైస్వామి సమావేశం ఉన్నాట్లు తమకు తెలిసిందని ఖలిస్తానీ అనుకూల యువకులు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఆయనను లోపలకు రానివ్వకుండా అడ్డుకున్నారని, దీంతో ఆయన వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారని మీడియా కథనాలు తెలిపారు. ఇక నుంచి ఏ గురుద్వారాలోనూ భారత అధికారులెవరినీ స్వాగతించేది లేదన్నారు. హై కమిషనర్‌కు విందు కోసం టేబుల్స్ సిద్ధం చేసి వుంచారు. సిక్కు యూత్ యుకె పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజిలో వుంచిన వీడియోలో కనిపిస్తోంది. హై కమిషనర్‌కు ఆహ్వానాన్ని పంపడంపై గురుద్వారా కమిటీ సభ్యుడొకరు ఘర్షణ పడడంతో సమస్య తలెత్తింది. ‘కెనడాలో ఏం జరుగుతోందో మాకు తెలుసు, భారత్ వైఖరిని బహిరంగంగా ఖండిస్తూ, భారత దౌత్యవేత్తలను కెనడా ప్రధాని బహిష్కరించడం మాకు చెంపపెట్టు వంటిది. వీసా దరఖాస్తుల పేరుతో అధికార హోదాలో ఎవరు గురుద్వారాకు వచ్చినా ఇదే జరుగుతుందని’ రాడికల్ సిక్కు గ్రూపునకు చెందిన ఒకరు తెలిపారు.









