తెలంగాణలో నేడు (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ ‘‘ప్రజాగర్జన సభ’’లో ప్రధాని మోదీ హామీల వర్షం కురిపించారు. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉందంటూ తెలుగులో మాట్లాడారు. బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పాలమూరు సభలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు పంటను అధికంగా పండిస్తారని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేశాం. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరముంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్ పార్క్స్, 4 ఫిషింగ్ క్టస్టర్స్ నిర్మిస్తాం అని మోదీ ప్రకటించారు.
మోదీ ప్రధానంగా ఇచ్చిన హామీలు ఇవే..
1.పసుపు రైతులకు కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు
2. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ
3. సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ, రూ.900 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
పసుపు గొప్పదనం తెలిసింది..
కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని.. పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుతో.. తెలంగాణలోని పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పసుపు రైతులకు మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రూ.13,500 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కేంద్రం చేపట్టిన పనులతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. దేశంలో పండుగల సీజన్ మొదలైందన్నారు. తెలంగాణ రైతులకు ప్రధాని మోదీ తీపికబురు చెప్పారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
మహబూబ్‌నగర్ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ ఏం చెప్పారంటే.. జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. కాచిగూడ-రాయ్ చూర్ మధ్య నూతన రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్లీ ప్రాజెక్టు పైప్ లైన్ ను ప్రారంభించారు. రూ.2457 కోట్ల నిర్మించనున్న సూర్యాపేట-ఖమ్మం హైవేకు శంకుస్థాపన చేశారు.జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. కాచిగూడ-రాయ్ చూర్ మధ్య నూతన రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ ను మోదీ జాతికి అంకితం చేశారు.









