AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరుణ్‌ తేజ్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌..

ఊహించని రేంజ్‌లో బ్యాచిలర్‌ పార్టీ పెట్టిన మెగా హీరో
కొంతకాలంగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో లవ్‌ ట్రాక్‌ నడిపిస్తున్న వరుణ్‌ తేజ్‌.. రీసెంట్‌ గానే ఆమెతో నిశితార్థం చేసుకొని తమ బంధాన్ని అధికారికం చేశారు. తాజాగా బ్యాచిలర్‌ పార్టీ కూడా చేసుకున్నారట. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి. అయితే వరుణ్‌ తేజ్‌ తాజాగా బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నట్లు సమాచారం. 40 మంది స్నేహితులకు ఆయన గ్రాండ్‌ గా పార్టీ ఇచ్చారని తెలుస్తోంది.

మన దేశంలో కాదు.. ఏకంగా స్పెయిన్‌ లో తన 40 మంది తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కు పెద్ద ఎత్తున బ్యాచిలర్‌ పార్టీ అరేంజ్‌ చేశారట వరుణ్‌ తేజ్‌. త్వరలోనే బ్యాచిలర్‌ లైఫ్‌ కు ముగింపు పలుకనున్న నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేశారట.

ఇకపోతే వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని టాక్‌. నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌ లోనే వీరి పెళ్లి జరగబోతుందని ఇన్‌ సైడ్‌ టాక్‌. ఇప్పటికే తేదీ కూడా ఫిక్స్‌ చేసి పెట్టుకుందట మెగా ఫ్యామిలీ. పెళ్లి కూడా డెస్టినేషన్‌ ప్లేస్‌ లోనే చేసుకోబోతున్నారని టాక్‌.

ANN TOP 10