బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 209 పెరిగింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గృహ అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.









