హైదరాబాద్: పలు అభివృద్ధి కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ చేరుకున్నారు. తొలుత హైదరాబాద్ చేరుకున్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో గవర్నర్ తమిళిసైతోపాటు పలువురు అధికారులు ఉన్నారు. కాగా పాలమూరు ప్రజాగర్జన సభలో తెలంగాణకు గిరిజన యూనివర్సిటీని మోదీ ప్రకటించనున్నారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.









