AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ కు మరో షాక్‌.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కసిరెడ్డి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. అయితే కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వలేదని తన స్థానంలో జైపాల్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ప్రస్తావించడంతో అసంతృప్తిలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఆఫర్ రావడంతో.. తాజాగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు.

ANN TOP 10