AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీపై వీహెచ్ ఫైర్.. చిత్తశుద్ధి ఉంటే అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలంటూ డిమాండ్

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ఫైర్ అయ్యారు. మణిపూర్‌లో గిరిజనుల మధ్య ఘర్షణలతో అతలాకుతలం అవుతోంది. ప్రధాని అక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ఉన్నది బీజేపీ సర్కారు. అందుకే ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన పెట్టడం లేదు. బహిరంగంగా ఎన్నో అకృత్యాలు అక్కడ జరుగుతున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ అక్కడి పరిస్థితి చక్కదిద్దాలని వీహెచ్ అన్నారు. మహిళా బిల్లు తెచ్చా అంటున్నారు.. కానీ, మణిపూర్‌లో మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి రాజకీయాలే ఎక్కువయ్యాయి అంటూ వీహెచ్ విమర్శించారు.

మోదీ పేరుకే బీసీ..
కాంగ్రెస్ బీసీ నేతలు వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నమాట నిజమేనని వీ హనుమంతరావు అన్నారు. మధు యాష్కీ సహా మా బీసీ నేతల్లో కొందరు ఖర్గేను కలిశారు. నేను నిన్న కేసీ వేణుగోపాల్‌ను కలిశాను. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని వీహెచ్ గుర్తుచేశారు. షాద్‌నగర్‌లో బీసీ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వస్తున్నారని, ఈ సభలో బీసీ డిక్లరేషన్‌కూడా ఉంటుందని వీహెచ్ చెప్పారు. బీసీ జనాభా రాష్ట్రంలో, దేశంలో సగం కంటే ఎక్కువ ఉన్నాం. బీసీలకు న్యాయం జరుగుతుందన్న అశతో ఉన్నాం. ప్రధాని మోదీ పేరుకే బీసీ అంటారు తప్ప, ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదని వీహెచ్ ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మమ్మల్ని గ్రూపుగా రావొద్దని చెప్పారు. విడిగా కొందరికి కలిసే అవకాశం ఇచ్చారు. బీసీలకు కనీసం 34 సీట్లు ఇస్తారన్న నమ్మకం ఉందని వీహెచ్ చెప్పారు.

ANN TOP 10