AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోయలో పడ్డ పర్యాటకుల బస్సు.. తొమ్మిది మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు నీలగిరి జిల్లా కున్నార్‌ – మెట్టుపాళయం జాతీయ రహదారిపై పక్కనే ఉన్న 50 అడుగుల లోయలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో 54 మందితో వెళ్తున్న టూరిస్ట్‌ బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించినట్లుగా తెలుస్తున్నది. ఘటనలో చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో కొందరిని రక్షించి కున్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. అయితే, ఊటీకి వెళ్లి తెన్‌కాశికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగిన జరిగినట్లు తెలుస్తున్నది.

ANN TOP 10