AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం

తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం శాసనసభ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ వికాస్‌రాజ్ మాట్లాడారు. ‘‘కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. అక్టోబర్ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్‌లో పలు కేంద్రాలను సందర్శిస్తారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు , ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, సీనియర్ అధికారులతో స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఎన్నికల నిర్వహణ, ఇతరత్రా అంశాలపై సీఎస్, డీజీపీలతో సమావేశం నిర్వహిస్తారు. మొదటి రోజు అన్ని రాజకీయ పార్టీలతో సెంట్రల్ టీం సమావేశం ఉంటుంది. తెలంగాణలో పది గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పొలిటికల్ పార్టీలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సీఈసీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. తెలంగాణలో 3.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 8లక్షల బోగస్ ఓట్లను గుర్తించాం. 20 లక్షల మందికి పైగా కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకొన్నారు’’ అని సీఈఓ వికాస్‌రాజ్ పేర్కొన్నారు.

ANN TOP 10