తెలంగాణ లో మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల్ని శాసించే సత్తా ఉన్న జాతి ముదిరాజ్ జాతి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన జూబ్లీ బస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్‌లో ముదిరాజ్ ఓట్లతో గెలిచిన కేసీఆర్ .. ముదిరాజ్ తల్లి పాలు తాగిన అని చెప్పే సీఎం.. ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా అవమానించారని, ముదిరాజ్‌ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని అన్నారు. ఇందుకు కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని.. కేసీఆర్‌ను గద్దె దించుతామని ముదిరాజ్ జాతి ప్రతిన పునారన్నారు. అది చేసి చూపిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.