వచ్చే ఎన్నికల్లో ప్రతి పక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు సినిమా చూపించబోతున్నారని.. అందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఈటల సెటైర్లు విసిరారు.
హైదరాబాద్‌లో స్వాతంత్య్రదినోత్సవం రోజున గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే సీఎం కేసీఆర్ స్పందించడం లేదని మండిపడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలికి క్షమాపణ చెప్పాలన్నారు. గిరిజన మహిళపై దాడి విషయంపై దర్యాప్తు చేయాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బస్తీలో జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.









