AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారుకు ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట దగ్గర (విజయవాడ – హైదరాబాద్‌ హైవే) ఈ ఘటన జరిగింది. వల్లభనేని వంశీ ఇవాళ ఎమ్మెల్యే వంశీ తన కాన్వాయ్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి.. ఎమ్మెల్యే ప్రయాణిస్తు‍న్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి ప్రమాదం తప్పింది.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10