AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..

ఆగివున్న రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..
మరో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ – KSR బెంగళూరు ఉద్యాన్ డైలీ ఎక్స్‌ప్రెస్ (రైలు)లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజన్ నుండి పొగలు రావడాన్ని స్టేషన్ అధికారులు గమనించి, అలారం మోగించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించిన సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సౌత్ వెస్టర్న్ రైల్వే పీఆర్ఓ అనీశ్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయణ్ణ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఈ శనివారం ఉదయం 5.45 గంటలకు ప్లాట్‌ఫారమ్ నంబర్ 3పైకి చేరుకుంది ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఆగి ఉన్న ఈ రైలులోని B1, B2 బోగీలలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఉదయం సుమారు 7.10 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 7.35 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

ANN TOP 10