తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మిడ్ మానేరు జలాశయంలో బోటింగ్ యూనిట్ ను ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ బోటింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. బోటులో ప్రయాణిస్తూ మిడ్ మానేరు జలాశయం అందాలను వీక్షించే సదుపాయం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కాగా, ప్రారంభోత్సవం అనంతరం, మంత్రి కేటీఆర్ ఓ బోటులో ప్రయాణిస్తూ స్టీరింగ్ ను తన చేతుల్లోకి తీసుకున్నారు. బోటును నడుపుతూ ఆస్వాదించారు. ఆ సమయంలో మంత్రివర్గ సహచరుడు శ్రీనివాస్ గౌడ్.. కేటీఆర్ పక్కనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.









