AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైభవంగా బ్రహ్మానందం చిన్న కొడుకు పెళ్లి..

కామెడీ బ్రహ్మ.. బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ- ఐశ్వర్యల వివాహం.. వైభవంగా జరిగింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు మహామహులు తరలివచ్చి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు.. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దంపతులు, మోహన్ బాబు ఫ్యామిలీ, కోట శ్రీనివాస రావు ఇలా సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ANN TOP 10