పెద్దవూర మండలంలో ని కొత్తగూడెం గ్రామానికి శనివారం సినీ నటుడు అల్లు అర్జున్, విద్యుత్‌శాఖ మంత్రి రానున్న ట్టు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, కేసీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెంలో నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి వారు హాజరవుతారన్నారు. నాయకులు, కార్యకర్తలు, అల్లు అర్జున్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు గాలి సైదిరెడ్డి, సుంకిరెడ్డి సంజీవరెడ్డి, కృష్ణప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, సాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ సీటును ఆశిస్తున్న ఆయన తనకు రాజకీయంగా ఉపయోగపడేలా కొత్తగూడంలో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 10వేల మంది హాజరవుతారని అంచనా.









