AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెండు నెలల్లో కేసీఆర్ ఇంటికే

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు నెలల్లో కేసీఆర్ ఇంటికే అంటూ వ్యాఖ్యలు చేశారు. మద్యం దరఖాస్తులతో రెండు వేల కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారన్నారు. మద్యం ద్వారా రూ.50 వేల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని తెలిపారు. బీఆర్‌ఎస్ మద్యంకు టెండర్లు.. కాంగ్రెస్ అభ్యర్థులకు టెండర్లు వేసిందని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు దొందూ దొందే అని అన్నారు. ఖరీదైన ఎన్నికలే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లక్ష్యమన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANN TOP 10