మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాయం వెంకటేశ్వర్లును మాయం గారు అంటూ ఫేస్‌బుక్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాహనదారులకు ఆర్టీవో ఆఫీస్ కావాలని గుర్తుకు రాలేదా లేక నీ వల్ల కాలేదా మాయం గారు.. ప్రజలకు అవసరమైన సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎందుకు తీసుకురాలేక పోయారో?.. కనీసం ప్రజల అవసరం కూడా గుర్తురాలే నీకు, అన్ని నేనే చేసా అని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తే నమ్మెదెలా మాయం గారు.. అన్ని నేనే చేశా అని ప్రగల్భాలు పలికే పాయం గారు 100 పడకల హాస్పిటల్ ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదో చెప్పగలవా? అది ఆనాడు రేగా కుట్ర.. లేకపోతే చేసేవాడిని అంటావేమో.. పనికిమాలిన వాళ్ళు పదిమంది కలిసి దమ్ముంటే గెలువు అని నన్ను అనే ముందు.. మీలో నాపై పోటీకి వచ్చే అంత దమ్మున్నోడు ఎవరో తేల్చుకోండి’’ అంటూ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.









