బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఇంఛార్జ్ వీసీ వెంకట రమణ అప్రమత్తమయ్యారు. రెండు నెలల వ్యవధిలోనే పీయూసీ-1 చదువుతోన్న ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటంతో.. వీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీయూసీ వన్ విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన పిల్లలు బాసర ట్రిపుల్ ఐటీలో ఉండగలరని అనుకుంటేనే తిరిగి పంపాలని ఆయన పేరెంట్స్‌కు సూచించారు.
ఆర్జీకేయూటీ కొత్త విధానాలపై తల్లిదండ్రులతో వీసీ చర్చించారు. ఇక్కడ ఉండేందుకు విద్యార్థులు మానసికంగా సిద్ధంగా లేరని వీసీ తెలిపారు. ఇక నుంచి ప్రతి శనివారం వీకెండ్ విత్ వీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా స్టూడెంట్స్ తమ సమస్యలను నేరుగా వీసీతో చెప్పుకునే అవకాశం లభించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం కోసం ఇక నుంచి ప్రతి శనివారం విలేజ్ టూర్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన నిర్ణయించారు.









